VIDEO: ఉద్యోగులను మోసం చేసి రూ.4కోట్లతో పరార్
నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని కృష్ణ మురళి అనే వ్యక్తి భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డాడు. ఉద్యోగుల సంతకాలు ఫోర్జరీ చేసి ఎనిమిది చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీల్లో సుమారు రూ.4 కోట్లతో పరారయ్యాడు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీస్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రతి నెల ఖాతాల నుంచి డబ్బులు కట్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.