నేటి నుంచి రెండో విడత నామినేషన్లు

నేటి నుంచి రెండో విడత నామినేషన్లు

మెదక్ జిల్లాలో నేటి నుంచి రెండో విడత 149 సర్పంచ్, 1290 వార్డులకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. జిల్లాలో 8 మండలాలలో సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మెదక్ డివిజన్‌లో మెదక్, రామాయంపేట, చిన్న శంకరంపేట, నిజాంపేట మండలాలు, తూప్రాన్ డివిజన్ లో తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి మండలాలలో నామినేషన్లు అధికారులు ప్రారంభించనున్నారు.