పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్‌కు వినతి
ములుగు జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే రెగ్యులర్ చేయాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సింహా మూర్తి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజావాణిలో 30 మంది కార్యదర్శులు తమ సమస్యలను ప్రస్తావించారు. గిరిజన గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివాసీలు సాగులో ఉన్న భూములకు పట్టాలివ్వాలన్నారు.