ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

BDK: జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకన్నపాలెం గ్రామం వద్ద బొలెరో వాహనం బైక్‌ను ఢీకొనడంతో ప్రమాదంలో గంగారం తండా గ్రామానికి చెందిన ధారావత్ రాంబాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.