హిందూజా పవర్ ప్లాంట్‌కు జరిమానా..!
VSP: విశాఖపట్నంలోని హిందూజా పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న యాష్‌పాండ్ ధూళి వల్ల స్థానికులు చర్మవ్యాధులకు గురవుతున్నారంటూ టీడీపీ కార్పొరేటర్ రౌత్ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి విచారణ చేపట్టింది. క్షేత్రస్థాయిలో పరిశీలనలో ప్లాంట్ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో పర్యావరణ చట్టాల మేరకు రూ.6.78 కోట్ల జరిమానా విధించింది.