కాంగ్రెస్‌లో చేరిన కొత్తపేట తండా బీఆర్ఎస్ నేత
NLG: దామరచర్ల మండలం కొత్తపేట తండా గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ ధనవత్ జ్యోతి నాగు నాయక్, తన అనుచరులతో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.