పుట్టపర్తికి చేరుకున్న మంత్రి నారా లోకేష్
సత్యసాయి: మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో కళ్యాణదుర్గానికి బయలుదేరారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఇవాళ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై దేశానిర్దేశం చేస్తారని నాయకులు తెలిపారు.