రేపు గీతాశ్రమంలో కృష్ణాష్టమి వేడుకలు

KDP: ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణ గీతాశ్రమంలో ఈనెల 16న కృష్ణాష్టమి వేడుకలు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు పాల్గొనాలన్నారు.