వైసీపీ ఆందోళనలకు పిలుపునివ్వటం విడ్డూరం: గంటా

వైసీపీ ఆందోళనలకు పిలుపునివ్వటం విడ్డూరం: గంటా

AP: అన్నదాత పోరు పేరిట వైసీపీ ఆందోళనలకు పిలుపునివ్వటం విడ్డూరమని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో 90 శాతం యూరియాను అందించినట్లు వెల్లడించారు. అయినా ఎందుకు ఆందోళనకు పిలుపునిచ్చారో వైసీపీ నేతలకే తెలియాలని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ వెంపర్లాడుతోందని మండిపడ్డారు.