ఆటోనగర్‌కు పూర్వ వైభవం తీసుకొస్తా: ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ ఆటోనగర్ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, ఆటోనగర్‌కు పూర్వ వైభవం తీసుకొస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. శుక్రవారం గుడివాడ పట్టణం ఆటోనగర్‌లో పర్యటించిన ఆయన, ట్రస్ట్ ఆధ్వర్యంలో ద్వారకా తిరుమల చిన్న తిరుపతి దేవస్థానానికి అందిస్తున్న 4వేల లీటర్ల వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు.