రేపు మరో యాపిల్‌ స్టోర్‌ ఓపెనింగ్

రేపు మరో యాపిల్‌ స్టోర్‌ ఓపెనింగ్

దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ భారత్‌‌లో మరో స్టోర్‌ను ప్రారంభించనుంది. రేపు నోయిడాలో ఏర్పాటు చేయనున్న కొత్త స్టోర్ భారత్‌లో యాపిల్‌కు ఐదోది కానుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణెలో యాపిల్ తన స్టోర్లను ఓపెన్ చేసి విక్రయాలు ప్రారంభించింది. వీటిలో ఐఫోన్, మ్యాక్‌బుక్, యాపిల్ వాచ్, ఐప్యాడ్ వంటి యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.