'చెట్లు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి'

'చెట్లు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి'

SKLM: సారవకోట(M) రాయి వాడ ఫారెస్ట్ రిజర్వ్ పరిధిలో శనివారం అటవీ శాఖ సెక్షన్ అధికారి ఈశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణ, అటవీ సంపద ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటి, పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు.