CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
NDL: డోన్ టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 13,05,642 విలువైన చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఆరోగ్య చికిత్సల కోసం ఈ సహాయం మంజూరైందని తెలిపారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తామన్నారు.