ఈ నెల 7న పాణ్యం- బనగానపల్లి రైల్వే గేటు మూసివేత

NDL: రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో భాగంగా ఈ నెల 7న పాణ్యం- బనగానపల్లి రహదారిలోని రైల్వే గేటును 24 గంటల పాటు మూసి వేస్తున్నట్లు ఇన్ ఛార్జ్ తహసీల్దారు రమాదేవి తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి 24 గంటల పాటు ఈ మార్గంలో రాకపోకలు ఉండవని తెలిపారు. నంద్యాల నుంచి బనగానపల్లికి వెళ్లే వాహనాలు ఇతర మార్గాల్లో వెళ్లాలని వారు సూచించారు.