VIDEO: సోమశిల జలాశయం తాజా నీటి మట్టం వివరాలు
NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. శనివారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 64.288 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుండి జలాశయానికి 307 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయంలో 295క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.