సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NTR: నందిగామ నియోజకవర్గ పరిధిలోని 59 మంది లబ్ధిదారులకు రూ.31,83,832 సీఎం సహాయ నిధి నుంచి చెక్కుల రూపంలో మంజూరైంది. ఈ రోజు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవసరంలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా మద్దతు అందించడం ఎంతో సంతృప్తికరమైన విషయం అని పేర్కొన్నారు.