ఆర్టీసీకి నష్టం కలిగించవద్దు: పొన్నం

ఆర్టీసీకి నష్టం కలిగించవద్దు: పొన్నం

TG: ఆర్టీసీ INTUC నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. తమ సమస్యలను మంత్రికి వివరించిన అనంతరం పొన్నం మాట్లాడారు. 'సమ్మె చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలి. సమ్మెకు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంస్థకు నష్టం కలుగుతుంది. కార్మికుల సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తాం' అని కార్మిక సంఘాల నేతలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.