హంస వాహనంపై విహరించిన వీరేశ్వరుడు

కోనసీమ: భక్తుల కోలాహలం, మంగళ హారతులు, బాణాసంచా కాల్పుల నడుమ హంస వాహనంపై ఐ. పోలవరం మండలం మురమళ్ల వీరేశ్వర స్వామి వారి తెప్పోత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండుగలా జరిగింది. విద్యుత్ దీపాల అలంకరణలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనంపై భద్రకాళి సమేతంగా వీరేశ్వర స్వామి వారు భక్తులకు కన్నుల పండుగలా దర్శనమిచ్చారు.