క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

BHPL: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఏసుక్రీస్తు జన్మ దినాన్ని పురస్కరించుకుని జరుపుకునే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు పరమ పవిత్రమైనదన్నారు. క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. మంచి మనసుతో సేవ చేయడం ఎలాగో క్రీస్తు బోధనలు తెలిపాయని పేర్కొన్నారు.