మద్యం మత్తులో ప్రాణం తీస్తే ఎనిమిదేళ్లు జైలు శిక్ష
JGL: మల్లాపూర్ రోడ్డు ప్రమాద కేసులో జగిత్యాల ప్రధాన సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో బైక్ నడిపి గుండంపల్లికి చెందిన శివరాత్రి సాగర్ మృతికి కారణమైన వేంపేటికి చెందిన మారంపెల్లి నవీన్‌కు కోర్టు 8 ఏళ్ల కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించింది. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి బైక్ ఇచ్చినందుకు వాహన యజమానికీ రూ. 20 వేల జరిమానా విధించింది.