గొట్ట బ్యారేజ్‌లో పెరుగుతున్న నీటి ప్రవాహం

SKLM: హిరమండలం మండలంలోని గొట్ట బ్యారేజ్‌లో నీటి ఉధృతి పెరుగుతోందని డీఈ సరస్వతి తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటలకు 14,881 క్యూసెక్కుల నీరు చేరిందని, దీనిని నదిలోకి విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎడమ కాలువకు 1223 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, కుడి కాలువకు నీటిని నిలిపివేశారు. 19 గేట్లను 20 సెంటీమీటర్ల మేర తెరిచినట్లు వివరించారు.