డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో రూ.4లక్షల జరిమానా
NZB: నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులకు కోర్టు భారీ జరిమానా విధించింది. తనిఖీల్లో దొరికిన 43 మందిని న్యాయస్థానంలో హాజరుపరచగా, 40 మందికి ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 4 లక్షల జరిమానా విధించారు. మిగిలిన ముగ్గురికి వారం రోజుల పాటు జైలు శిక్ష ఖరారు చేశారు.