భూసార వలంటీర్లతో లక్ష మంది రైతులకు మేలు!
NLG: పల్లెపల్లెకు భూసార వలంటీర్లను నియమించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హాలియా సబ్ డివిజన్ రైతులకు భారీ ప్రయోజనం కలగనుంది. మూడు నెలల్లో 4 లక్షల మట్టి నమూనాలను పరీక్షించి, నేలలోని పోషకాలు, ఎరువుల మోతాదుపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ఇక్రిశాట్, వర్సిటీ భాగస్వామ్యంతో సాగే ఈ ప్రక్రియ ద్వారా పంట దిగుబడి పెరుగుతుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది.