ఏల్చూరిలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు

ఏల్చూరిలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు

BPT: సంతమాగులూరు మండలం పరిధిలోని ఏల్చూరు గ్రామంలో గురువారం పేకాట శిబిరంపై పోలీసులు దాడి నిర్వహించారు. సీఐ వెంకటరావు ఆధ్వర్యంలో సంతమాగులూరు పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,100 నగదు స్వాధీనం చేసుకున్నారు.అక్రమ కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ దాడుల్లో సంతమాగులూరు పోలీసులు ఉన్నారు.