సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
MDK: రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రి వైద్యం చేసుకున్న పసుల రిషికేష్ అనే వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే సహకారంతో 11 వేల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. పిఎసిఎస్ డైరెక్టర్ మామిడి సిద్ధరాములు బాధితులకు చెక్కు అందజేశారు.