'ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలి'

ADB: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గత నెల రోజులుగా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో నిర్వహిస్తున్న అఖండ జ్యోతిని దర్శించుకున్నారు. గ్రామస్తులు చేపడుతున్న కార్యక్రమాన్ని అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు రాజు, జిల్లా బీజేపీ అధ్యక్షులు బ్రహ్మానంద్ తదితరులు ఉన్నారు.