హైవేపై భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు
SRPT: సంక్రాంతి రద్దీ దృష్ట్యా జాతీయ రహదారిపై భారీ వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. జనవరి 10 నుంచి 18 వరకు లారీలు, ట్రక్కులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. శుక్రవారం రైస్ మిల్లర్లు, సిమెంట్ కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సరుకుల రవాణాకు పోలీసుల అనుమతి తప్పనిసరి అన్నారు.