తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి
SRPT: మఠంపల్లి మండలంలోని వర్థాపురంలో సోమవారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కుతుండగా మోకు తెగిపడి వల్లపుదాసు చిన్న హుస్సేన్ గౌడ్ (55) అనే గీత కార్మికుడు మృతి చెందారు. గీత కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.