చిలంకూరులో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చిలంకూరులో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

KDP: జమ్మలమడుగు నియోజకవర్గం చిలంకూరులో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ ఎంపీటీసీ నవీన్ కుమార్ కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని ఎగురవేసి, నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నేటి నుంచి గ్రామపంచాయతీల్లో బీజేపీ ఆధ్వర్యంలో 'మన ఊరు మన జెండా' పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నవీన్ కుమార్ తెలిపారు.