'మాతృ, శిశు మరణాలు తగ్గేలా చూసుకోవాలి'

'మాతృ, శిశు మరణాలు తగ్గేలా చూసుకోవాలి'

SRCL: గర్భిణీ స్త్రీల నమోదు కార్యక్రమాన్ని సకాలంలో చేపట్టి మాతృ శిశు మరణాలు తగ్గేలా చూసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా చూసుకోవాలన్నారు. పోషక ఆహారంపై అవగాహన కల్పించాలన్నారు.