ద్విచక్ర వాహనాలు రికవరీ చేసిన పోలీసులు

విజయవాడలోని ఓ ఫైనాన్స్ స్థలంలో పార్కింగ్ చేసిన 6 ద్విచక్ర వాహనాలు మాయమైన విషయం తెలిసిందే. ఈ చోరీపై ఫైనాన్స్ సంస్థ మేనేజర్ శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. నిందితుడు శ్రీకాకుళానికి చెందిన వాడిగా గుర్తించి అతని వద్ద నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులకు స్ధానికులు అభినందనలు తెలిపారు.