MP డబుల్ ఓటింగ్?.. అధికారులు క్లారిటీ
బీహార్‌లో ఓటు వేసిన తర్వాత MP శాంభవి చౌదరి రెండు వేళ్లకు సిరా గుర్తు కనిపించడంతో ఇది డబుల్ ఓటింగ్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. తాజాగా దీనిపై పాట్నా యంత్రాంగం స్పష్టత ఇచ్చింది. పోలింగ్ సిబ్బంది పొరపాటున మొదట కుడి చేతికి సిరా వేయగా, ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఎడమ చేతికి కూడా వేశారని తెలిపింది. కాబట్టి ఆమె ఒక్కసారి మాత్రమే ఓటు వేశారని క్లారిటీ ఇచ్చింది.