కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
BHPL: గణపురం మండల కేంద్రంలోని ప్రముఖ కోటగుళ్లలో ఇవాళ ఉదయం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజ కార్యక్రమాల అనంతరం కోటగుళ్లను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.