పుంగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం
CTR: పుంగనూరు పట్టణం బీఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. వివిధ కంటి జబ్బులతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ శిబిరానికి రాగా మదనపల్లి లయన్స్ కంటి హాస్పిటల్ డాక్టర్ అనిల్ పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్లకు 17 మందిని ఎంపిక చేసినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు బాలసుబ్రమణ్యం తెలిపారు.