రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు

రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు

TG: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో.. రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నట్లు చెప్పింది.