ప్రభుత్వ పాఠశాల సందర్శన

ప్రభుత్వ పాఠశాల సందర్శన

NLR: అల్లూరు మండలంలోని స్థానిక జడ్పీ హైస్కూల్‌ను ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గురువారం సందర్శించి విద్యార్థుల స్థితిగతులు, అకడమిక్ అభివృద్ధిపై సమగ్ర పరిశీలన చేశారు. పాఠశాల అభివృద్ధి కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. విద్య, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.