'స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి'
KMM: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు మద్దెల రవి అన్నారు. ఆదివారం వైరాలోని 20 వార్డుల నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాలని శ్రేణులకు సూచించారు.