జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి: సీపీఎం

జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి: సీపీఎం

KDP: పోరుమామిళ్ల మండలంలోని జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. బాపనయ్య కాలనీ, జీబీ నగర్ కాలనీల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు ఇంటి పన్ను, డోర్ నంబర్లు ఇవ్వడంతో పాటు కరెంట్, మంచినీరు, డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. సీపీఎం మండల కార్యదర్శి భైరవ ప్రసాద్, ఎంపీడీవో కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం సమర్పించారు.