CMRF చెక్కులు పంపిణీ చేసిన ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్

ATP: శింగనమల నియోజకవర్గ లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటీమడుగు కేశవరెడ్డి పంపిణీ చేశారు. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన రంగనాయకులుకు రూ. 62,946, కల్లూరుకు చెందిన నాగేశ్వరమ్మకు రూ. 30,786, పెనకచర్లకు చెందిన రామిరెడ్డికి రూ. 80,508 విలువైన చెక్కులను అందజేశారు.