బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం

బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం

పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల ఐప్యాక్‌పై దాడుల సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఈడీ అధికారుల విషయంలో బెంగాల్ ప్రభుత్వ తీరును ధర్మాసనం తప్పుబట్టింది. ఈడీ అధికారులకు వ్యక్తిగత హక్కులు వర్తించవా? అంటూ ప్రశ్నించింది.