నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం: కొమరోలు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పొట్టిపల్లి, కంకరవానిపల్లి గ్రామాలలో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అధికారులకు ప్రజలు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.