పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
KRNL: కోసిగి మండలం రంగప్పగట్టు వెనుక భాగంలో ఉన్న కంపచెట్ల వద్ద పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఆరుగురిని పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.9,850 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు SI రమేష్ ఇవాళ తెలిపారు. పల్లెపాడు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న మరో 7 మందిని, వారి వద్ద నుంచి రూ.11,790 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.