అగ్నిమాపక వారోత్సవాల్లో సేవా కార్యక్రమం

అగ్నిమాపక వారోత్సవాల్లో సేవా కార్యక్రమం

JGL: జగిత్యాల ఫైర్ స్టేషన్లో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అదనపు కలెక్టర్ బీఎస్. లత కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీఎఫ్వో సైదులు, ఎస్ఎఫ్వో కృష్ణకాంత్ మాట్లాడుతూ.. 1944 ముంబై అగ్ని ప్రమాద బాధితులను స్మరించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు అవసరమని సూచించారు.