VIDEO: నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ
SRPT: మునగాల మండల కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కోదాడ DSP శ్రీనివాస్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకున్న భద్రతా చర్యలను, బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.