VIDEO: పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన స్పీకర్

VIDEO: పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన స్పీకర్

అనకాపల్లి: మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో గురువారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి శిబిరాలు పాడి రైతులకు ఎంతో ఉపయోగకరమని స్పీకర్ అన్నారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం లేగదూడల ప్రదర్శనను పరిశీలించారు.