భూపేశ్ రెడ్డికి కడప జిల్లా పగ్గాలు ?

KDP: జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జ్ భూపేశ్ రెడ్డికి కడప జిల్లా అధ్యక్ష బాధ్యతలను పార్టీ అధిష్ఠానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి (వాసు)కి అదనంగా పొలిట్ బ్యూరో పదవి ఉండటంతో భూపేశ్‌కు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రేసులో ప్రొద్దుటూరు టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కూడా ఉన్నారు.