ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

KKD: సామర్లకోట మండలం వేట్లపాలెంలో సోమవారం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో సప్ప విజయ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల బాణసంచా ప్రమాదంలో విజయ్ తల్లి మృతి చెందగా, ఇప్పుడు కొడుకుకు ప్రమాదం జరగడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.