'దౌర్జన్యాలకు పాల్పడితే చర్యలు తప్పవు'

'దౌర్జన్యాలకు పాల్పడితే చర్యలు తప్పవు'

BPT: అద్దంకి పట్టణంలో 4 రోజుల క్రితం హిజ్రాలు వీరంగం చేసి పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన నేపథ్యంలో అద్దంకి సీఐ సుబ్బరాజు మంగళవారం పలు హెచ్చరికలు చేశారు. ఎవరైనా దుకాణాల వద్దకు, శుభకార్యాల వద్దకు వెళ్లి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేయాలని చూస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు.