'బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం'

'బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం'

VZM: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని వన్‌ స్టాప్‌ సెంటర్‌ కేర్‌ వర్కర్‌ అనిత తెలిపారు. పాతరేగ జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 18 ఏళ్లలోపు పిల్లలకు వివాహాలు చేస్తే 366 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలికలకు సమస్యలు ఎదురైతే 1098, 181, 112, 1930 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.