ఆటో ఢీకొని చిన్నారి మృతి
JN: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆటో ఢీకొనడంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్‌లో చిన్నారి రోడ్డు దాటుతుండగా ఈ దారుణం జరిగింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.